జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయం పై క్లారిటీ ఇచ్చేశారు. నిన్న రాత్రి మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభలో పవన్ ఆవేశంగా మాట్లాడారు.
తనపై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పారు.రాబోయే ఎన్నికల్లో ఏవిధంగా వ్యవహరించబోతున్నాము అనే విషయం పైన క్లారిటీ ఇచ్చారు.
కులాలు , మతాల అంశాల పైన స్పందించారు.తనకు సంపూర్ణ నమ్మకం వస్తేనే పొత్తులు కుదురుతాయని పవన్ చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో వచ్చిన నివేదికల్లో కచ్చితంగా జనసేన గెలుస్తుందనే రిపోర్టులు వస్తేనే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.ఇక బిజెపితోను తాను ఏ విధంగా వ్యవహరించబోతున్నాననే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.
ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోది అవసరమని భావించానని పవన్ అన్నారు ప్రత్యేక హోదా కోసం తాను నిలబడి బిజెపిని దూరం చేసుకుంటే అది వైసిపికి దగ్గర అయిందన్నారు.

ప్రత్యేక హోదా కోసం తాను పట్టుబడితే అందరూ తనను ఒంటరి చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు కలిసి పని చేసి ఉంటే ఇప్పటికే టిడిపి కంటే బలపడేవారుమని, తెలుగుదేశం పార్టీపై తనకు ఎటువంటి ప్రేమ లేదని, చంద్రబాబు అంటే గౌరవం మాత్రం ఉందని పవన్ అన్నారు. టిడిపి తో పొత్తు విషయంపై ఇప్పటివరకు తాను చర్చించలేదని, ఈసారి ఎన్నికల్లో జనసేన బలి పశువు కాదని , ప్రయోగాలు చేయబోనని , అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెడతాను అని పవన్ అన్నారు.
మొత్తంగా పవన్ తన ప్రసంగంలో వైసీపీని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చూడడమే తన లక్ష్యం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.అలాగే ఒంటరిగా జనసేన పోటీకి వెళితే లాభం ఉండదని, మళ్లీ పరాభవమే తప్పదనే అభిప్రాయంకు పవన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.
నిన్న జరిగిన సమావేశంలో ఈసారి బలి పశువును కానని పవన్ చెప్పారు.

టిడిపి తో పరోక్షంగా పొత్తు ఉంటుందనే సంకేతాలను కేడర్ కు పంపించారు.కోరినన్ని సీట్లు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన ప్రాధాన్యం ఉంటేనే ఈ పొత్తు ఉంటుందనే విధంగా పవన్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే అర్థమవుతుంది.ఏదో ఒక సందర్భంలో బిజెపితో పొత్తు తెగ తెంపులు చేసుకోబోతున్నాననే విషయాన్ని పవన్ హింట్ ఇచ్చారు.
మరోవైపు కులాల అంశాన్ని ప్రస్తావించారు.తాను ఏ కులాన్ని గద్దినెక్కించడానికి రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా టిడిపి అంశాన్ని ప్రస్తావించారు.







