బాలయ్య సినిమాలో ఆ విలక్షణ నటుడు.. దబిడి దిబిడే!

టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ దొరికినట్లే.ఆయన చేసే సినిమాలు మాస్ ఆడియెన్స్ పల్స్‌ను టచ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అవుతూ ఉంటాయి.

 Vijay Sethupathi In Balakrishna Movie, Vijay Sethupathi, Balakrishna, Gopichand-TeluguStop.com

దీంతో ఆయన సినిమాలో చాలా మంది విలక్షణ నటీనటులు నటించేందుకు ఆసక్తి చూపుతుంటారు.ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య చేయబోయే ఓ సినిమాలో మరో విలక్షణ నటుడు నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ ఆ నటుడు ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా?

తమిళంలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ సేతుపతి, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో విజయ్ సేతుపతి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు.

ఇక ఈ యాక్టర్ ఎలాంటి పాత్రలోనైనా లీనైపోవడంలో తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.కాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాలో విజయ్ సేతుపతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ విషయమై గోపీచంద్ మలినేని విజయ్ సేతుపతితో చర్చలు కూడా జరిపాడట.ఇదేగనక నిజమైతే బాలయ్య లాంటి మాస్ హీరోతో విజయ్ సేతుపతి తలపడే సీన్స్‌కు థియేటర్ల టాప్‌లు లేచిపోవడం ఖాయమని మాస్ ఆడియెన్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటాడా లేడా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది.త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా బాలయ్య నటిస్తున్న అఖండ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube