ఈ గౌరవం వారందరికీ దక్కుతుంది.. డాక్టరేట్ అందుకోవడం పై చరణ్ కామెంట్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) డాక్టర్ రామ్ చరణ్ తేజ్ గా మారిన సంగతి తెలిసిందే .ఈయన ఇండస్ట్రీకి చేస్తున్న సేవలను గుర్తించినటువంటి యూనివర్సిటీ ఈయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తూ సత్కరించింది.

 Ram Charan Comments About His Doctorate Details, Ramcharan, Vels University, Doc-TeluguStop.com

వేల్స్ యూనివర్సిటీ( Vels University ) లో జరిగినటువంటి స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్( Doctorate ) అందుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telugu Chennai, Chiranjeevi, Ram Charan, Doctorate, Ramcharan, Ram Charan Fans,

ఈ విధంగా వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.నా పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపించి ఎంతో గౌరవంతో డాక్టరేట్ అందించిన వేల్స్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఎంతో అద్భుతంగా రన్ అవుతున్నటువంటి యూనివర్సిటీ నుంచి నాకు ఈ విధమైనటువంటి గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Telugu Chennai, Chiranjeevi, Ram Charan, Doctorate, Ramcharan, Ram Charan Fans,

యూనివర్సిటీ నుంచి నాకు ఇలాంటి గౌరవం దక్కింది అనే విషయం తెలిసి మా అమ్మగారు చాలా ఆశ్చర్యపోయారని తెలియజేశారు.ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.నిజం చెప్పాలంటే ఈరోజు నాకు దక్కిన ఈ గౌరవం నాది కాదు.నా అభిమానులది నాతోటి దర్శకులు నిర్మాతలు నటీనటులదని తెలిపారు.ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.ఇక చెన్నైతో( Chennai ) నాకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ చెన్నై నాకు అన్ని ఇచ్చిందని చెన్నైతో తనకు తన కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా చరణ్ గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube