టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆయన నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది మనసులను దోచుకున్నాడు.
హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే.వ్యక్తిగతంగా ఎంతో మందికి సహాయం చేసిన మంచి వ్యక్తిగా నిలిచాడు.
హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే మహేష్ బాబుకు అందం పరంగా కూడా మంచి అభిమానం ఉంది.
ఆయన కోసం అమ్మాయిలు తెగ ఎగబడతారు.ఎందుకంటే ఆయన అందం అలా ఉంటుంది.
అయితే తన అందాన్ని చూసి తాజాగా ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగితే ఆమెను కాదని టికెట్స్ కోసం వెళ్లి ఆమెను అవమాన పరిచాడు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.
మహేష్ బాబు ప్రస్తుతం శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న మేజర్ సినిమా కు నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.ఏ ప్లేస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా మహేష్ కి చెందిన జి ఎం బి తో కలిసి నిర్వహిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.ఈయన సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా జూన్ 3 న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదలకు దగ్గర్లో ఉన్న సందర్భంగా వరుస ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్నారు సినీ బృందం.దీంతో ప్రమోషన్స్ భాగంలో సినీ బృందం ఒక వీడియోని రూపొందించి దానిని సోషల్ మీడియాలో వదిలారు.

ఇక ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో ఏముందంటే.మహేష్ బాబు, యూట్యూబర్, అడవి శేష్, డిజిటల్ క్రియేటర్ అయినా నిహారిక ఎన్ ఎమ్ లు ఉన్నారు.ఇక ఇందులోని నిహారిక.ఇది మేజర్ సినిమా లైనేనా అని టికెట్ కౌంటర్ లో తన ముందు ఉన్న వారిని అడిగింది.దాంతో వాళ్లు అవును అనటంతో టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆ సమయంలో ఆమె ముందు కొందరు వచ్చి లైన్లో నిలబడుతూ ఉంటారు.అంతేకాకుండా అడవి శేషు కూడా రావడంతో ఎందుకు వస్తున్నారు అంటూ అతని తో గొడవ పడుతుంది.అప్పుడే మహేష్ బాబు కూడా వచ్చి క్యూలో నిలబడతాడు.మహేష్ బాబు ని కూడా గట్టిగా నిలదీయాలని అనుకోవడంతో.వెంటనే ఆయనను చూసి ఆశ్చర్యపోయి ఫిదా అవుతుంది.ఇక తన ఫ్రెండ్స్ ను కూడా పిలవచ్చా అని మహేష్ బాబు అడగడంతో దానికి కూడా ఓకే అంటుంది.
వెంటనే నిహారిక మహేష్ బాబుని ఫోన్ నెంబర్ అడగటంతో.మహేష్ బాబు అందర్నీ తోసుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు.ఇక వెనకాల ఉన్న అడవి శేష్ నా నెంబర్ ఇవ్వమంటావా అని నెంబర్ ఇస్తూ ఉంటాడు.ఆ వీడియో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.







