మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్.. అధికారంలోకి వస్తే ఇండియాపై ప్రతీకార పన్ను ..!!

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.

 Trump Doubles Down On Reciprocal Tax For India If He Is Us President Again Detai-TeluguStop.com

అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

( Donald Trump ) తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.

అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని, ఎన్నడూ వినని, ఎవరితో పొంతనలేని అధ్యక్షుడెవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.అన్నింటికీ మించి అత్యంత వివాదాస్పద వైఖరి ఆయన్ను అందరితో పోలిస్తే భిన్నంగా ఉండేలా చేశాయి.

ట్రంప్ ఏదైనా బహిరంగంగా చెప్పేస్తారు… ముందొక మాట, వెనకాల మరో మాట వుండవు.ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం ఆయనది.

కానీ ట్రంప్ రాజకీయ జీవితానికి ఇవే పెద్ద శత్రువులు.దీని వల్లే తనంతట తానుగా ఆయన ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తుంటారు.

ప్రస్తుతం అమెరికాలో రాజకీయాలు( America Politics ) వాడి వేడిగా వున్నాయి.కారణం మరికొద్దినెలల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటమే.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( US President Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.

ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్‌ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Ron Desantis ) కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telugu America, Democratic, System, India, Joe Biden, Reciprocaltax, Republican,

ఇక వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే ట్రంప్.భారతదేశంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.తాను మరోసారి అధ్యక్షుడినైతే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.భారత్‌లో అమెరికా ఉత్పత్తులపై అత్యధిక పన్నులు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండియాలో 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్నులు వున్నాయని.పరిస్ధితులు ఇలాగే కొనసాగితే అమెరికన్ కంపెనీలు( America Companies ) భారత్‌లో వ్యాపారం ఎలా చేస్తాయని ట్రంప్ ప్రశ్నించారు.2024లో రిపబ్లికన్ పార్టీని( Republican Party ) గెలిపిస్తే.భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నులు విధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Telugu America, Democratic, System, India, Joe Biden, Reciprocaltax, Republican,

ట్రంప్ అధ్యక్షుడిగా వున్న సమయంలో భారత్‌కు జీఎస్పీ హోదాను (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ )( Generalised System of Preferences ) రద్దు చేశారు.దీని వల్ల అమెరికాకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయడానికి వీలుంటుంది.ప్రస్తుతం డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ అధికారంలో వుండటంతో జీఎస్పీ హోదాను పునరుద్ధరించేలా భారత్ – అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌లో అలజడి రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube