మెడ నలుపును వారం రోజుల్లో మాయం చేసే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

ఒక్కోసారి కొందరి మెడ నల్లగా మారిపోతుంటుంది.ముఖం రంగు తో పోలిస్తే మెడ రంగు చాలా తక్కువగా ఉంటుంది.

 Magical Home Remedy For Removing Neck Darkness In One Week! Home Remedy, Dark Ne-TeluguStop.com

ఎండల ప్రభావం, మృత కణాలు( Sun exposure, dead cells) పేరుకుపోవడం, ప్రెగ్నెన్సీ, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.డార్క్ నెక్ వ‌ల్ల‌ ముఖం కూడా కాంతిహీనంగానే కనిపిస్తుంటుంది.

ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లో మెడ నలుపు మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక టమాటో ( Tomato )ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( rice flour ), నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకోవాలి.

Telugu Tips, Dark Neck, Remedy, Latest, Neck, Neck Remedy, Skin Care, Skin Care

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ సి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric ), హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.ఆపై వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Neck, Remedy, Latest, Neck, Neck Remedy, Skin Care, Skin Care

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మెడ ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లో తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మెడ నలుపును వదిలించడానికి ఈ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.కాబట్టి ఎవరైతే మెడ నలుపుతో బాధపడుతున్నారో.మెడ నలుపు ను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో.వారు తప్పకుండా ఈ మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube