1.వైఎస్ వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో సిబిఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.నేడు సిబిఐ విచారణకు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి , వంటమనిషి కొడుకు ప్రకాష్ హాజరయ్యారు.
2.వైసిపి ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవడంలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.
3.బెంగళూరు నుంచి నరసాపురం కి ప్రత్యేక రైలు
నైరుతి రైల్వే జోన్ వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నుంచి నరసాపురం కి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది.
4.మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం

రానున్న మూడు రోజుల్లో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
5.ఎంసెట్ పరీక్ష పై ఉన్నత విద్య మండలి కీలక నిర్ణయం
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎంసెట్ పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
6.ఏపీ ప్రభుత్వ సిట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీ ప్రభుత్వ సిట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది .హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
7.యువ గళం పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.
8.సిపిఐ రామకృష్ణ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు .అకాల వర్షాలు వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సిపిఐ బృందం పర్యటించింది.ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని రామకృష్ణ విమర్శించారు.
9.ఏపీలో నేడు భారీ వర్షాలు
ఏపీలో నేడు భారీ వర్షాలు తో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది.శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేసి ఉన్నారు.
11.బిజెపి కార్పొరేటర్ల ధర్నా
హైదరాబాదులోని వాటర్ బోర్డు కార్యాలయం లో ఈరోజు ఉదయం బిజెపి కార్పొరేటర్లు మెరుపు ధర్నా నిర్వహించారు.సీనరేజీ నిర్వహణ చేపట్టడం లేదని , పూడిక తీయట్లేదని బిజెపి కార్పొరేటర్లు ధర్నాకు దిగారు.
12.ఎంసెట్ కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్

తెలంగాణలో జరగనున్న ఎంసెట్ పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
13.సిరిసిల్లలో ఆక్వా హబ్
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల లో మానేరు డ్యాం వద్ద త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మంచినీటి ఆక్వాహాబ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
14.భోగాపురం ఎయిర్ పోర్ట్ కు జగన్ శంకుస్థాపన

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
15.నెహ్రూ జూ పార్క్ టికెట్ ధరల పెంపు
ప్రముఖ పర్యట కేంద్రమైన నెహ్రూ జూ పార్క్ టికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జూ పార్క్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
16.దుర్గగుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దుర్గగుడి సూపరిండెంట్ నగేష్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి.
17.యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ధర్నా
యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణం తర్వాత స్థానిక ఆటోలను కొండపైకి అధికారులు అనుమతించకపోవడంతో ధర్నా చేపట్టారు.దీనికి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మద్దతు తెలిపారు.
18.తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
19.నేడు ఢిల్లీకి కేసిఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.
20.యువ గళం పాదయాత

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 83వ రోజు చేరుకుంది.కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి యాత్రను ఈరోజు లోకేష్ ప్రారంభించారు.







