భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా( Australia ) తో ఆడనుంది.చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో పలు రికార్డులపై ఇరుజట్ల ఆటగాళ్లు కన్నేశారు.
రెండు జట్ల మధ్య ఇది 150వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.కాబట్టి నేడు జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.
అయితే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఓ భారీ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు రోహిత్ శర్మ 551 సిక్సులు కొట్టాడు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.మొదటి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సులతో ఉన్నాడు.
రోహిత్ శర్మ మరో మూడు సిక్సులు కొడితే ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా అవతరిస్తాడు.

రోహిత్ శర్మ మరో ఎనిమిది సిక్స్ లు కొడితే వన్డేలలో 300 సిక్సుల మైలురాయి చేరుకుంటాడు.ఇక భారత జట్టు మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే.శుబ్ మన్ గిల్ ( Shubman Gill ) మరో 83 పరుగులు చేస్తే వన్డేల్లో 2000 పరుగులను పూర్తి చేసుకుంటాడు.
భారత జట్టు యువ ప్లేయర్ ఇషాన్ కిషన్( Ishan Kishan ) మరో 114 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు.మరో 10 ఫోర్లు కొడితే వన్డేల్లో 100 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.
భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో ఐదు వికెట్లు తీస్తే స్వదేశంలో జరిగిన వన్డేల్లో వంద వికెట్లను పూర్తి చేసుకుంటాడు.ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే.
గ్లెన్ మాక్స్ వెల్ మరో ఏడు పరుగులు చేస్తే వన్డేల్లో 6000 పరుగులు పూర్తవుతాయి.ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ మార్కస్ స్టోయినీస్ మరో ఐదు సిక్సులు కొడితే వన్డేల్లో 50 సిక్సులు పూర్తవుతాయి.
మొత్తానికి నేడు జరిగే మ్యాచ్లో తమ జట్టు విజయంతో పాటు పలు రికార్డులపై ఇరు జట్లు కన్నేశాయి.