అడవిలో ఆదివాసుల విశిష్టమైన జీవన విధానం, ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తూ ఉన్నారు.మేడారం సమ్మక్క – సారలమ్మ( Medaram Sammakka – Saralamma ) ప్రకృతిలో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు.
ఈ మహా జాతర ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది.తాజాగా మేడారం జాతర 2024 తేదీలను గిరిజన పూజారులు ( Tribal priests )ఖరారు చేసినట్లు సమాచారం.
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఫిబ్రవరి 21వ తేదీన బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.అదేరోజు పూనుగొండ నుంచి పగిద్దరాజు( Pagidaraju ), కొండాయి గ్రామానికి చెందిన గోవిందరాజును అర్చకులు మేడారం గద్దెపైకి తీసుకువస్తారు.22వ తేదీన గురువారం సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకుని వచ్చి, 23వ తేదీన శుక్రవారం రోజు వనదేవతలు గద్దెలపై కొలువుదీరుతారు.అమ్మవార్లను పొలాల్లో కొలువుదీరిన రోజు నుంచి కోట్లాదిమంది గిరిజనులు, ఇతర ప్రజలు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు వస్తూ ఉంటారు.

పసుపు, కుంకుమ, ఎండు బియ్యం, మరియు బెల్లం సమర్పిస్తారు.కోళ్లు, మేకలను కూడా బలి ఇస్తారు.సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలో ఎగిరేసి ఆరగింపు చేస్తారు.24వ తేదీ శనివారం సమ్మక్క సారలమ్మ పగిద్దరాజు గోవిందరాజులు తిరిగి వానప్రస్వానికి చేరుకుంటారు.మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేస్తోంది.
జాతరకు కొన్ని నెలల ముందు కూడా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది.ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
ఈ జాతరను 1940 వరకు చిరుకల గట్టుపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు.కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగిపోయింది.
మన దేశంలో చాలా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు జాతరకు రావడం మొదలుపెట్టారు.అప్పటినుంచి మేడారంలో జాతర జరుగుతూ ఉంది.
ఈ జాతరకు దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది.