బట్టతలకు చెక్ పెట్టే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇది.. అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

This Is A Powerful Remedy To Check Baldness!, Baldness, Home Remedy, Latest News, Hair Care, Hair Care Tips, Thick Hair, Stop Hair Fall, Hair Fall

బట్టతల( Bald Head ). ఈ మాట వింటేనే పురుషుల్లో అలజడి మొదలవుతుంది.

 This Is A Powerful Remedy To Check Baldness!, Baldness, Home Remedy, Latest News-TeluguStop.com

రోజు విపరీతంగా జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు.ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని తెగ హైరానా పడిపోతుంటారు.

అందులోనూ పెళ్లి కాని పురుషులు అయితే ఇంకాస్త ఎక్కువ టెన్షన్ పడుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ముందు టెన్షన్ పడటం ఆపండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే ప‌వ‌ర్ ఫుల్‌ రెమెడీని పాటించడం స్టార్ట్ చేయండి.

ఈ రెమెడీ బట్టతలకు అడ్డుకట్ట వేయడానికి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Remedy, Latest, Thick-Telugu Health

ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్‌( Aloevera Gel ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగిన నీరు మరియు అర కప్పు కొబ్బరి పాలు వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Remedy, Latest, Thick-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.బట్టతల వస్తుందేమో అని భయపడుతున్న పురుషులకు ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్( Hair fall Control ) అవుతుంది అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.

దీంతో బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల డ్రై హెయిర్ సమస్య( Dry air ) నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

కాబట్టి ఒత్తయిన జుట్టును కావాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube