ఇటీవల ఒక బ్రిటిష్ ఇండియన్( British Indian ) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.భారతదేశాన్ని “ధరలు ఎక్కువగా ఉన్న మురికి కూపం” ( Overpriced Dump ) అంటూ రెడిట్ పోస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.
మూడేళ్లు భారతదేశంలో( India ) పర్యటించిన అనుభవం ఉన్న ఆ వ్యక్తి, దేశంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎక్కడ చూసినా చెత్తగా, మురికిగా ఉందని, కనీస పౌర స్పృహ కూడా లేదని విమర్శించాడు.అంతేకాదు, ధనికులకు, పేదలకు మధ్య ఉన్న అంతరం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, జీవన వ్యయం రోజురోజుకీ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ తొలగించాడనుకోండి, కానీ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.నెటిజన్లు ఆయన భారతమాతనే అవమానించాడంటూ విమర్శిస్తున్నారు.కొందరు ఆ వ్యక్తి చేసిన విమర్శలను సమర్థిస్తూ భారతదేశంలో నిజంగానే ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాదిస్తున్నారు.మరికొందరు మాత్రం దేశాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ ఘటనతో భారతదేశంలోని పర్యాటక రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సదరు టూరిస్ట్ ( Tourist ) భారతదేశాన్ని మురికి కంపుకొట్టే ఒక చెత్త కుప్ప అంటూ చేసిన ఈ వివాదాస్పద పోస్ట్‌కు మద్దతుగా ఉత్తరకాశికి చెందిన ప్రముఖ పర్యాటక వ్యాపారవేత్త ఆనంద్ శంకర్( Anand Sankar ) చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి.“భారతదేశం ఇప్పుడు విపరీతంగా ఖరీదైన పర్యాటక ప్రదేశంగా మారింది” అని ఆయన కుండబద్దలు కొట్టారు.శంకర్ ఇంకా మాట్లాడుతూ… కాలుష్యంతో నిండిన గాలి, పరిశుభ్రత లోపం, మహిళల భద్రతకు ముప్పు, గందరగోళమైన రవాణా వ్యవస్థ వంటి సమస్యలు పర్యాటకులకు పెద్ద అవరోధాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల వల్ల భారతదేశం తన ప్రత్యేక ఆకర్షణను, ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోతోందని ఆయన ఆందోళన చెందారు.అంతేకాదు, విమాన టికెట్ల ధరలు మండిపోతుండటంతో, స్థానిక ప్రయాణాలు కూడా ఖరీదు కావడంతో మధ్యతరగతి భారతీయులు కూడా పర్యటనలకు వెళ్లాలంటే జంకుతున్నారని ఆయన అన్నారు.