డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఇలాగే కాబోలు.. వైరల్ వీడియో

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.

 Mother Challenges Daughter Close Cooker Lid Watch Happened Next Video Viral Deta-TeluguStop.com

ప్రస్తుత రోజులలో చాలామంది పిల్లలకు బయట ప్రపంచం గురించి అసలు తెలియదు.అంతేకాకుండా, ఇంట్లో బాధ్యతలు అసలు పట్టించుకోరు.

కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఇంటి బాధ్యతలు చక్కగా నేర్పేవారు.అలాగే మగ పిల్లలకు బయటకు వెళ్లే పనులు చేయడం.

ఆడపిల్లలకు ఇంట్లో ఉండి వంట పని చేయడం అలవాటు చేసేవారు.కానీ, ప్రస్తుత కాలంలో అంత తారుమారు అయిపోయింది.

పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా మారిపోయి పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేసేసారు.తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పుల వల్ల పిల్లలు కూడా చదువు తప్ప వేరే ఏ విషయంలో ఎటువంటి పరిజ్ఞానం లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు.అయితే, తాజాగా ఒక అమ్మాయి కుక్కర్ మూత( Cooker Lid ) కూడా పెట్టలేకపోయింది.అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.కుక్కర్ మూత పెట్టాలని అపర్ణ( Aparna ) అనే మహిళా తన కూతురుకు( Daughter ) ఒక సవాలు విసిరింది.

వాస్తవానికి ఆ అమ్మాయికి ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలోన్న విషయంపై కూడా అవగాహన లేదు .ఎంత ప్రయత్నం చేసినా కానీ.కుక్కర్ మీద మూత పెట్టలేకపోయింది.

ఈ క్రమంలో తల్లి ఆ కుక్కర్ మూతను క్షణాల్లో పెట్టి భవిష్యత్తులో ఇలా ఉంటే ఎలా నువ్వు ఎలా వండుకొని తింటావు అని అడుగుతే.ఆ అమ్మాయి అందుకు బదులుగా చెఫ్ ని పెట్టుకుంటా అని సమాధానం ఇచ్చింది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ జనరేషన్ పిల్లలకు వంట చేయడం అవసరమా.? సిగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని మరీ తింటారు అని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు పిల్లలు ఇలా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube