తోటివారిపై ప్రేమ, కరుణ చూపించడంతో పాటు మానవతావాదానికి భారతీయులు పెట్టింది పేరు.ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా అందరూ బాగుండాలని, శాంతి సామరస్యాలతో ప్రజలు విలసిల్లాలని కోరుకుంటారు .
అందుకే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తుంటుంది.ప్రపంచాన్ని కుదిపేసిన ఎన్నో విపత్తుల సమయంలో మనదేశం అండగా నిలిచింది.
కాగా.బ్రిటన్ మహారాజు కింగ్ చార్లెస్ III( King Charles III ) – క్వీన్ కెమిల్లా( Queen Camilla ) దంపతులు తూర్పు లండన్‌లో కమ్యూనిటీ ఈవెంట్‌ను జరుపుకోవడానికి వాల్తామ్ ఫారెస్ట్ టౌన్ హాల్‌లో( Waltham Forest Town Hall ) జరిగిన రిసెప్షన్‌కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యువకులు, అత్యవసర సేవా కార్యకర్తలు, కమ్యూనిటీ వాలంటీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వగా వారితో రాజ దంపతులు సరదాగా సంభాషించారు.
ఈ క్రమంలో భారత సంతతికి చెందిన హర్విందర్ రట్టన్.( Harvinder Rattan ) రాజుతో జరిపిన సంభాషణ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.యువర్ మెజిస్టి.
శోభోదయం, ఎలా ఉన్నారు అనగా.నేను ఇంకా బతికే ఉన్నానంటూ కింగ్ చార్లెస్ సరదాగా ఇచ్చిన సమాధానంతో అంతా నవ్వేశారు.
ది రాయల్ ఫ్యామిలీ( The Royal Family ) యూట్యూబ్ ఛానెల్‌లో దీనికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ కాగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున కింగ్ చార్లెస్‌ను హర్విందర్ ఈ ప్రశ్న అడిగి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్ సోకినట్లు నిర్థారణ అయినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది.ప్రస్తుతం రాజుకు చికిత్స జరుగుతోందని ఇది వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగుతుందని రాయల్ ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి.
డిసెంబర్ 19న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజ కుటుంబం కోసం క్రిస్మస్ పార్టీ( Christmas Party ) ముగిసిన ఒక రోజు తర్వాత టౌన్ హాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చార్లెస్ దంపతులు హాజరయ్యారు.రాజ కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనాదిగా సాంప్రదాయంగా వస్తోంది.