నరేష్ (Naresh)పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి(Malli Pelli).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తుంది.ఈ సినిమాలో నటి వనిత విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసింది.
ఈమె నరేష్ మూడో భార్యా రమ్య రఘుపతి పాత్రలో నటించారు.ఇక ఈమె పాత్రకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఇలా ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన వనిత విజయ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను నటించిన పాత్ర ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని చేశారు.తనకు ఏ మాత్రం తెలియదని చెప్పారు.అసలు ఈ రమ్య రఘుపతి (Ramya Raghupathi)ఎవరో కూడా తనకు తెలియదంటూ వనిత విజయ్ కుమార్ తెలియజేశారు.
దర్శకుడు ఎమ్మెస్ రాజు తన వద్దకు వచ్చి ఎక్కువగా ఏడ్చకూడదు అతిగా నటించకూడదు మేకప్ లేకుండా సహజ సిద్ధంగా తెరపై కనిపించాలని మాత్రమే చెప్పారు కానీ ఈ పాత్ర ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేశారు అనే విషయం మాత్రం తనకు తెలియదని వనిత వెల్లడించారు.

ఇందులో వనిత విజయ్ కుమార్ సౌమ్య సేతుపతి పాత్రలో నటించారు.ఈ పాత్ర గురించి చెప్పేటప్పుడు తనకు ఫలానా మహిళ నిజ జీవిత పాత్ర అని అస్సలు చెప్పలేదు.నాకు ఎలాంటి రిఫరెన్సులు కూడా ఇవ్వలేదు అని స్పష్టం చేశారు.
అయితే ఈమె నటించిన సౌమ్య సేతుపతి పాత్ర రమ్య రఘుపతి పాత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈమె నరేష్ మూడో భార్య కాగా నరేష్ పవిత్ర విషయంలో రమ్య రఘుపతి వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే.







