ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో వచ్చే సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం అంటూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే కచ్చితంగా మరోసారి వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అందుకే అన్ని పార్టీలను కలుపుకొని పోయే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని మార్గాల్లో తాము ప్రయత్నం చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైకాపా నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆ విషయం పక్కన బెడితే తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీని ఏపీలో బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR )అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.

అవునన్నా.కాదన్నా ఏపీలో కూడా కేసీఆర్ కి అభిమానులు ఉంటారు.బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కొన్ని ఓట్లను దక్కించుకోగలదు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చగలరు అనే విషయంలో సందేహం లేదు.పవన్ కళ్యాణ్ ఆశ పడుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే బీఆర్ఎస్ పార్టీతో కూడా పవన్ ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి కేసీఆర్ ఆ పార్టీలతో కలిసి వస్తాడా అంటూ కచ్చితంగా లేదనే ప్రచారం జరుగుతుంది.
పైగా ఆ పార్టీకి సీట్లు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ టీం ఓకే చెప్పేనా అంటే అది కూడా అనుమానమే అంటున్నారు.మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటే ఏం చేయాలో ఆలోచించాల్సిన సమయం ఇది అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న ఈ సందర్భంగా కేసీఆర్ తీసుకోబోతున్న చర్యలు మరియు ముందు ముందు అనుసరించబోతున్న వ్యూహాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.







