ఏసీ, కూలర్ కి ప్రత్యామ్నాయమే ఈ వాటర్ స్ప్రే ఫ్యాన్‌... రూమ్ క్షణాల్లో కూల్ అయిపోతుంది!

ఏప్రిల్ నెల మొదలయ్యిందో లేదో, ఎండలు ( Summer ) ఏపీ అంతటా భగ్గుమంటున్నాయి.ఈ క్రమంలో చాలామంది ఏసీలవైపు మొగ్గు చూపుతుంటారు.

 Water Spray Fans An Alternate To Ac And Coolers Details, Technology Updates, Tec-TeluguStop.com

అయితే అందరూ ఏసీలు కొనలేరు కదా.సరికదా కూలర్లు కొందామన్నా ధరలు మండిపోతున్న పరిస్థితి.అందుకనే మీ కోసం ఇపుడు ఓ అదిరిపోయే వార్తతో వచ్చాము.అవును, మీరు ఇపుడు ఈ వాటర్ స్ప్రే ఫ్యాన్స్( Water Spray Fan ) గురించి తెలుసుకోవాల్సిందే.

ఏసీ, కూలర్ లేకుండా వేడి నుంచి ఉపశమనం పొందటానికి ఇపుడు మార్కెట్లో మరో ఆప్షన్ వచ్చేసింది.అదే వాటర్ స్ప్రే ఫ్యాన్.

Telugu Alternative, Cooler, Latest, Mist Fans, Mist Fan, Cool, Seconds, Fans, Up

ఏసీ ( AC )వంటి వాటితో పోలిస్తే వీటి ధర చాలా తక్కువగానే ఉంటుంది.వీటిని అన్ని తరగతులవారు తేలికగా కొనుక్కోవచ్చు.ఇంకా దీన్ని ఎప్పుడైనా, ఎలాగన్నా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.వాటర్ స్ప్రే ఫ్యాన్స్ అని వీటిని ఎందుకు అంతమంటే ఇవి వాటర్ స్ప్రేను వెదజల్లుతాయి కాబట్టి.ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతున్నప్పుడు ఇలా వాటర్ స్ప్రే రావడంతో రూమ్ వెంటనే కూల్ అయిపోతుంది.వీటి మెయింటనెన్స్ కూడా ఏసీలు, కూలర్ల మాదిరి ఘోరంగా ఉండదు.

కరెంట్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది.ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల వాటర్ స్ప్రే ఫ్యాన్స్ అందుబాటులో ఉన్నాయి.

Telugu Alternative, Cooler, Latest, Mist Fans, Mist Fan, Cool, Seconds, Fans, Up

ఇవి మీకు కావాలంటే ఈకామర్స్ సైట్ల నుంచి ఆర్డర్ ఇవ్వొచ్చు.దీని రేటు రూ.2000 నుంచి ప్రారంభం అవుతుంది.మిస్ట్ ఫ్యాన్ అమెజాన్‌లో అందుబాటులో కలదు.ఇది 26 ఇంచుల సైజ్‌లో ఉండి, ఎత్తు 6.5 అడుగులు కలిగి ఉంటుంది.ఒక్కసారి మీరు దీన్ని ఆన్ చేస్తే రూమ్ టెంపరేచర్ 5 నుంచి పది డిగ్రీలకు తగ్గిపోతుంది.వాటర్ స్ప్రే దాదాపు 10 అడుగుల వరకు జల్లుతుంది.అలాగే ఓరియెంట్ ఎలక్ట్రిక్ కూడా ఇలాంటి ఫ్యాన్‌ను అందిస్తోంది.ఇంకా క్లౌడ్ కూలింగ్ ఫ్యాన్ కూడా అందిస్తోంది.

దీని పేరు క్లౌడ్ 3.ఇందులో 4.5 లీటర్ ట్యాక్ ఉంటుంది.ఇది కూడా కూలర్ మాదిరి మీ రూల్‌ను కూల్ చేసేస్తుంది.

ఉబెర్ స్వీట్ రీచార్జబుల్ వాటర్ స్ప్రే ఫ్యాన్ కూడా అందుబాటులో ఉంది.మీమీ అభిరుచిని బట్టి మీకు నచ్చిన దానిని కొనుక్కోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube