మూడోసారి గెలుపుపై కేసీఆర్ ధీమా అదేనా ? 

తెలంగాణలో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాలో బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) ఉన్నారు.అందుకే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత కొద్దిరోజులుగా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.

 Is Kcr Confident Of Winning For The Third Time Brs, Telangana, Kcr, Bjp , Congr-TeluguStop.com

జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కేటీఆర్,  హరీష్ రావు , కవితల ద్వారా పార్టీని బలోపేతం చేసే విషయంపై కేసీఆర్ దృష్టి సాధించారు.జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతూ మిగిలిన మంత్రులు, కీలక నాయకులు యాక్టివ్ అయ్యే విధంగా చేస్తున్నారు.

పార్టీలో ఉన్న అసంతృప్తులను గుర్తిస్తూ, వారికి బుజ్జగింపులు చేస్తున్నారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.

గతంలో మాదిరిగా కెసిఆర్ టెన్షన్ పడడం లేదు.విజయంపై జగన్ ధీమా గానే ఉన్నారు.

ఒకవైపు నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలలోను అసంతృప్తి పెరిగిపోయిందని,  బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే నివేదికలు వస్తున్న, కేసీఆర్ పట్టించుకోవడం లేదు.

Telugu Bandi Sanjay, Brs, Congress, Revanth Reddy, Telangana-Politics

మంత్రి కేటీఆర్,  హరీష్ రావు( KTR )ల ద్వారా జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలు చేయిస్తూ,  అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నా.కేసీఆర్ గతంలో మాదిరిగా టెన్షన్ పడకుండా గెలుస్తామనే ధీమాలో ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయట.

ప్రస్తుతం టీ ఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం , పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలు వంటివి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.ఈ విషయంలో కాంగ్రెస్,  బిజెపిలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి.

అయినా కేసీఆర్ మాత్రం కూల్ గానే కనిపిస్తున్నారు.దీనికి కారణం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగినా,  ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బిజెపిలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతాయని, అప్పుడు కచ్చితంగా బీఆర్ఎస్( BRS party ) గెలుస్తుందనే నమ్మకంతో కేసీఆర్ ఉన్నారట .

Telugu Bandi Sanjay, Brs, Congress, Revanth Reddy, Telangana-Politics

 అందుకే రాష్ట్ర రాజకీయాలకంటే జాతీయ రాజకీయాలపై ఎక్కువగా కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.గతంతో పోలిస్తే బిజెపి బాగా బలపడింది.వరుస పోరాటాలు చేస్తూ జనాల్లో ఉంటోంది.కాంగ్రెస్ కూడా బిజెపితో సమానంగా బలపడేందుకుప్రయత్నిస్తోంది.ఈ రెండు పార్టీలు బలం పుంజుకుంటేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీలి తమకు లాభం చేకూరుస్తోందనే ఆశల్లో కేసీఆర్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube