సీతాఫలం ఇది సీజనల్ పండు.ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు.
సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది.ఈ ఫలం చూడడానికి హృదయాకారంలో ఉంటుంది.
ఈ పండులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయని నిపుణులు తెలిపారు.ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది.అందువల్ల రక్తహీనత, ఎనీమియా దరి చేరనీయదని నిపుణులు తెలిపారు.
ఈ పండులో ఇందులో ఉండే ఐరన్ వల్ల ఆర్టరీస్ హెల్దీగా ఉంటాయి.హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయని తెలిపారు.
సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది.బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది.తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమవుతాయని తెలియజేశారు.అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.
సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి.
ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది.ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
సీతాఫలాన్ని తీసుకుని జాగ్రత్తగా, బాగా కడిగేయాలి.ఇప్పుడు అందులో ఉండే గింజలు తీసేసి గుజ్జుని మెత్తగా చేయండి.ఈ గుజ్జుకి ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ కలపండి.ఇప్పుడు అందులో ఒక అరటిపండు ని ముక్కలు గా కట్ చేసి వేయండి.
అందులోనే ఒక కప్పు పెరుగు కలపండి.వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయండి.
మీ స్మూతీ తయారైపోయింది.దీనిని గ్లాస్ లో పోసుకుని ఎంజాయ్ చేయడమేనని నిపుణులు తెలిపారు.