ఎంత చెప్పినా ఆ విషయాన్ని పవన్ ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా?

విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రం( Kushi ) షూటింగ్ శర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.గత సంవత్సరంలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నా కూడా సమంత అనారోగ్య కారణాలవల్ల ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయలేక పోయారు.

 Shiva Nirvana Clarity About Kushi Movie Title , Kushi , Shiva Nirvana , Tollywo-TeluguStop.com

సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించిన దర్శకుడు శివ నిర్వాణ అందుకోసం స్పీడ్ గా షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ కూడా సమాంతరంగా నిర్వహిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా యొక్క టైటిల్ విషయం లో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ అవ్వడం వల్ల ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆ విషయమై తాజాగా దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ.పవన్ అభిమానులు( Pawan Kalyan ) మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఖుషి టైటిల్ ని ఇష్టపడతారు.అలాంటి టైటిల్ తమ సినిమా కు ఎందుకు పెట్టామో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తాను పబ్లిసిటీ కోసం ఈ టైటిల్ పెట్టలేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.కథకు అత్యంత కీలకంగా కనుకనే ఖుషి టైటిల్ పెట్టానని.

కచ్చితంగా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అంటారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను హైదరాబాదు లో నిర్వహిస్తున్నామని అతి త్వరలోనే మరో విదేశీ షెడ్యూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.ప్రస్తుతం సినిమా యొక్క అప్డేట్ ప్రకారం విడుదల తేదీ మారేది.లేదని క్లారిటీ ఇచ్చారు.

ముందు ముందు ఏమైనా జరిగితే తప్పితే అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు తీసుకు రాబోతున్నట్లుగా దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube