నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా..? అని హీరోయిన్ ని అడిగిన నెటిజెన్....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు సామాన్యులకు దూరం బాగా తగ్గిపోయింది.అంతేకాకుండా కొందరు సినీ సెలబ్రిటీలు తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిమానులతో ముచ్చటించడం మరియు అప్పుడప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటివి చేస్తుండడంతో ఫ్యాన్స్ కి మరియు సెలబ్రిటీల కి మధ్య ఇంటరాక్షన్ బాగా పెరిగింది.

 Netizen Second Marriage Proposal To The Tamil Actress Anjana Chandran, Tamil Act-TeluguStop.com

దీంతో కొంతమంది వ్యక్తిగతంగా ప్రశ్నలు అడుగుతూ సెలబ్రిటీలను విసిగిస్తున్నారు.కాగా తాజాగా ఓ తమిళ నటి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగా ఓ నెటిజన్ ఏకంగా నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా ? అని అడిగాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే కోలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ న్యూస్ యాంకర్ గా రాణిస్తున్న నటి అంజనా చంద్రన్ గురించి సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఇటీవలే అంజనా చంద్రన్ ప్రముఖ తమిళ సీరియల్ నటుడు చంద్రన్ ని ప్రేమించి ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది.

అయితే వీడియో జాకీ అంజనా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.దీంతో తాజాగా అంజనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

దీంతో బాలాజీ అనే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.

Telugu Anjana Chandran, Kollywood, Netizenproposal, Proposal, Tamil Actress-Movi

దీంతో అంజనా చంద్రన్ తనదైన శైలిలో స్పందిస్తూ మన పెళ్లి విషయం మా ఆయనతో మాట్లాడానని ఆయన వెంటనే ఒప్పుకున్నారని, అంతేకాకుండా నీ అడ్రస్ చెప్తే నన్ను అక్కడికి పార్సల్ చేస్తానని కూడా చెప్పారని సరదాగా రిప్లై ఇచ్చింది.ఈ విషయానికి సంబందించిన వీడియోని కూడా షేర్ చేసింది.దీంతో ఆ నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అంజనా చంద్రన్ కోలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు రకాల షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా రాణిస్తోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు కూడా ఇస్తూ కుర్రకారుని బాగానే ఆకట్టుకుంటోంది.

కాగా అంజనా చంద్రన్ ఇటీవలే ఓ తమిళ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube