Adi Seshagiri Rao: అంతా చీకటి మయంగా మారిపోయింది... కృష్ణా మరణం పై ఆదిశేషగిరిరావు ఎమోషనల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిపోయింది.ఐదు దశాబ్దల సినీ కెరియర్లో సుమారు 350 కి పైగా సినిమాలలో నటించి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీ తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.

 Adi Seshagiri Rao Emotional On Hero Krishna Demise Details, Adiseshagiri Rao, Em-TeluguStop.com

ఈ విధంగా కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు.ఇలా ఒకే ఏడాది మహేష్ బాబు సోదరుడు తల్లి తండ్రి మరణించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇకపోతే నేడు కృష్ణ పెద్దకర్మ నిర్వహిస్తున్న సమక్షంలో పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలెబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.ఇకపోతే నేడు కృష్ణ గారి పెద్దకర్మ కావడంతో ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు కృష్ణ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.

తన అన్నయ్యతో 70 సంవత్సరాల అనుబంధం ఉందని అయితే అన్నయ్య మరణంతో తన జీవితం మొత్తం చీకటిమయంగా మారిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇలా తన అన్నయ్య మరణంతో అంత శూన్యంలా మారిపోయిందని ఈయన ఆవేదన చెందడమే కాకుండా తన అన్నయ్యతో కలిసి చిన్నప్పుడు చేసిన సంఘటనలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

Telugu Ghattamaneni, Krishna Brother, Krishna Demist, Krishnas, Mahesh Babu, Kri

అన్నయ్య చిన్నప్పుడు తనని సైకిల్ పై సినిమాకు తీసుకు వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు.ఇక నేడు అన్నయ్య తనని విడిచి వెళ్లడం వర్ణాతీతం అని, ఆయన స్మారక మందిరాన్ని నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్లు ఆదిశేషగిరిరావు వెల్లడించారు.అన్నయ్య అల్లూరి సీతారామరాజు సినిమా చేసే సమయంలో రోజుకు మూడు షిఫ్ట్ లలో పనిచేసే వారంటూ తన సినీ కెరియర్ గురించి వెల్లడించారు.ఇక సినిమాల విషయంలో అన్నయ్య లెక్క ఎప్పుడూ తప్పేది కాదని సినిమాలలో ఎంతో సమర్థవంతంగా జడ్జిమెంట్ చేసే వారని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు కృష్ణ గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube