శృంగారం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు.. రాధికా ఆప్టే కామెంట్స్ వైరల్!

బోల్డ్ కామెంట్స్ ద్వారా తరచూ వార్తల్లో నిలిచే నటిగా రాధికా ఆప్టేకు పేరుంది.తెలుగులో లెజెండ్, లయన్, మరికొన్ని సినిమాల్లో నటించిన రాధికా ఆప్టేకు ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉంది.

 Tollywood Actress Radhika Apte Sensational Comments About Bold Scenes In Movies-TeluguStop.com

బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ ద్వారా రాధికా ఆప్టే వార్తల్లో నిలవగా పలు వివాదాల ద్వారా కూడా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం రాధికా ఆప్టే హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నా రాధికా ఆప్టే ఆచితూచి అడుగులేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే బోల్డ్ సీన్లలో నటించడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్య కాలంలో ఒక డైరెక్టర్ తనకు వేశ్య పాత్రను ఆఫర్ చేశాడని గతంలో తాను నటించిన సినిమాలను బట్టి ఈ పాత్రను ఆఫర్ చేశానని డైరెక్టర్ తనకు చెప్పాడని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.

ఆ దర్శకుడు ఆ విధంగా చెప్పడంతో తాను షాకయ్యానని రాధికా ఆప్టే కామెంట్లు చేశారు.

Telugu Legend, Radhika Apte, Radhikaapte-Movie

మరో దర్శకుడు అత్యాచారాలకు సంబంధించిన సినిమాను తెరకెక్కిస్తున్నానని తనకో పిచ్చి కాన్సెప్ట్ ను చెప్పాడని ఆమె అన్నారు.ఈ కథలను తాను రిజెక్ట్ చేశానని రాధికా ఆప్టే కామెంట్లు చేశారు.బోల్డ్ సీన్లలో నటించడం తప్పు కాదని సీన్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్లలో నటించాలని రాధికా ఆప్టే అన్నారు.

Telugu Legend, Radhika Apte, Radhikaapte-Movie

కేవలం అలాంటి కథలకు మాత్రమే తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని తన శరీరం విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆమె వెల్లడించారు.ఏ కథ పడితే ఆ కథకు తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని ఆమె కామెంట్లు చేశారు.ఇప్పటివరకు తాను ఓకే చెప్పిన సినిమాలన్నీ మనసుకు నచ్చిన సినిమాలేనని రాధికా ఆప్టే వెల్లడించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube