బైడెన్ జట్టులో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి..!!

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే ఇండో అమెరికన్లకు కీలక పదవి దక్కుతుందని అందరూ భావించారు.అందుకు తగినట్లుగా ఎన్నికల్లో విజయం సాధించిన నెక్ట్స్ మినిట్ నుంచి ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య, ఫారిన్ పాలసీలకు సంబంధించి తన ప్రణాళికల అమలుకు ఉద్ధండులైన నిపుణులను తన జట్టులో నియమిస్తున్నారు బైడెన్.

 In Biden's Digital Team, India-born Aisha Shah Bags Senior Position, India-born-TeluguStop.com

ఈ లిస్ట్‌లో ఎంతోమంది భారతీయులకు చోటు కల్పించారు.కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్‌‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా, వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా బైడెన్ నియమించారు.

తాజాగా జో.మరో ఇండో అమెరికన్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

వైట్‌‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ టీమ్‌ భాగస్వామ్య మేనేజర్‌గా భారత సంతతికి చెందిన అయేషా షానుఆయన నియమించారు.డిజిటల్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ రాబ్‌ ప్లాహెర్టీ నేతృత్వంలో ఆమె పని చేస్తారు.

కశ్మీర్‌కు చెందిన షా.లూసియానాలో పెరిగారు.బైడెన్‌-కమల ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు.అంతకుముందు జాన్‌ఎఫ్‌ కెన్నడీ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కార్పోరేట్‌ ఫండ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.

Telugu Abbey Pitzer, White, Brendan Cohen, Cameron Trimble, Tom, Jaime Lopez, Jo

బైడెన్ నియమించిన వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలోని ఇతర సభ్యుల విషయానికి వస్తే.బ్రెండన్ కోహెన్ (ప్లాట్‌ఫామ్ మేనేజర్), మహా ఘండౌర్ (డిజిటల్ భాగస్వామ్య మేనేజర్), జోనాథన్ హెబర్ట్ (వీడియో డైరెక్టర్), జైమ్ లోపెజ్ (ప్లాట్‌ఫాంల డైరెక్టర్), కరాహ్నా మాగ్‌వుడ్ (క్రియేటివ్ డైరెక్టర్), అబ్బే పిట్జెర్ (డిజైనర్), ఒలివియా రైజ్నర్ (ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్), రెబెకా రింకెవిచ్ (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ), క్రిస్టియన్ టామ్ (డిజిటల్ స్ట్రాటజీ డిప్యూటీ డైరెక్టర్) మరియు కామెరాన్ ట్రింబుల్ (డిజిటల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్) ఉన్నారు.వీరంతా వైట్‌హౌస్‌ను సామాన్య ప్రజానీకానికి చేరువ చేస్తారు.కాగా, అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube