వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని చుండ్రు విపరీతంగా వేధిస్తుంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు, పొడి గాలులు వంటి కారణాల వల్ల తలలో చుండ్రు ఏర్పడి తెగ ఇబ్బంది పెడుతుంటుంది.
ఈ క్రమంలోనే చుండ్రును తగ్గించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తుంటారు.అయినా ఫలితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మదన పడిపోతూ ఉంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడితే గనుక చాలా ఈజీగాను చుండ్రును పోగొట్టుకోవచ్చు.
మరి ఆలస్యం ఎందుకు ఆ నూనె ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వేపాకులు, అర కప్పు కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కప్పు కలబంద ముక్కలు, అర కప్పు మల్లె పూలు, మూడు మందారం పువ్వులు వేసుకుని వాటర్ సాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై మందపాటి గిన్నె పెట్టుకుని.అందులో ఒక లీటర్ కొబ్బరి నూనె , ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమం, రెండు స్పూన్ల మెంతి పొడి వేసి కలుపుకోవాలి.ఇప్పుడు స్లో ఫ్లేమ్‌పై తిప్పుకుంటూ బాగా మరిగించి.స్టవ్ ఆఫ్ చేయాలి.ఆ తర్వాత నూనెను చల్లార బెట్టుకుని ఫిల్టర్ చేసి ఒక డబ్బాలో నింపుకుంటే చుండ్రును పోగొట్టే సూపర్ ఆయిల్ సిద్ధమైనట్టే.
ఇక ఈ ఆయిల్‌ను ఎలా వాడాలో కూడా చూసేయండి.
ముందుగా తలపై ఈ ఆయిల్‌ను వేసుకుని.వేళ్లతో పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై గంట వదిలేసి అప్పుడు మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు పరార్ అవుతుంది.
అదే సమయంలో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.