వింటర్ సీజన్( Winter Season ) మొదలైంది.చలిపులి మెల్లమెల్లగా బలపడుతోంది.
అయితే ఈ వింటర్ సీజన్ లో ప్రధానంగా చర్మ సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి.అలాగే పెదాల పగుళ్లు( Cracked Lips ) బాగా విసిగిస్తాయి.
పెదాల పగుళ్ల వల్ల తీవ్రమైన అసౌకర్యానికి, నొప్పికి గురవుతుంటారు.ఈ క్రమంలోనే పెదాల పగుళ్లను నివారించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.
పెదాల పగుళ్లు ఏర్పడ్డాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.మరి మీరు కూడా వింటర్ లో పెదాల పగుళ్లకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు కచ్చితంగా పాటించాల్సిందే.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షియా బటర్( Shea Butter ) వేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసి మరిగించాలి.అలా మరిగిన వాటర్ లో షియా బటర్ వేసిన గిన్నెను పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మెల్ట్ అయిన బటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ), రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని రెండు గంటల పాటు వదిలేస్తే మంచి హోమ్ మేడ్ లిప్ బామ్( Homemade Lip balm ) సిద్ధం అవుతుంది.ఈ లిప్ బాబ్ రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడేందుకు ప్రయత్నించండి.ఇది మీ పెదాలను పొడిబారకుండా కాపాడుతుంది.
ఎక్కువ సమయం పాటు తేమగా ఉంచుతుంది.వింటర్ లో పెదాల పగుళ్లు సమస్య దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.
పెదాలను కోమలంగా మృదువుగా మెరిపిస్తుంది.కాబట్టి ప్రస్తుత ఈ శీతాకాలంలో అందమైన మృదువైన మెరిసే పెదాలను కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా న్యాచురల్ లిప్ బామ్ ను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.