మళ్ళీ కమెడియన్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్న సప్తగిరి

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత పరుగు సినిమాతో నటుడుగా మారి ప్రేమకథా చిత్రమ్ మూవీతో కమెడియన్ గా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటుడు సప్తగిరి.హర్రర్ కామెడీగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ లో సప్తగిరి కామెడీ విపరీతంగా వర్క్ అవుట్ అయ్యింది.దీంతో కమెడియన్ గా అతనికి అవకాశాలు క్యూ కట్టాయి.ఒక్కసారిగా స్టార్ కమెడియన్ గా సప్తగిరి మారిపోయాడు.ఏకంగా రోజుకి రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి అతని ఇమేజ్ పెరిగిపోయింది.అయితే కమెడియన్స్ గా సక్సెస్ అయిన తర్వాత చాలా మంది చేసే తప్పుడు హీరోగా మారాలని ప్రయత్నాలు చేయడం.

 Sapthagiri Tries Again For Comedian Roles, Tollywood, Ek Mini Katha Movie, Comed-TeluguStop.com

అలా హీరోగా ఎదగాలని అనుకునే చాలా మంది కమెడియన్స్ రెండికి కాకుండా దెబ్బ తిన్నారు.

సునీల్ స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడు హీరోగా టర్న్ తీసుకొని ఇక కామెడీ పాత్రలు పూర్తిగా వదిలేసాడు.

అయితే హీరోగా అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు.కమెడియన్ గా ప్రస్తుతం సునీల్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించడం లేదు.

దీంతో విలనీ పాత్రలు కూడా ట్రై చేస్తున్నాడు.ఇక సప్తగిరి కూడా కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకొని ఏకంగా మూడు సినిమాలు చేశాడు.

అయితే వీటిలో ఏ ఒక్కటి అతనికి అదృష్టం తీసుకురాలేదు.కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.

దీంతో మళ్ళీ కమెడియన్ గా టర్న్ తీసుకొని బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.ఏక్ మినీ కథ మూవీలో హీరో భావ పాత్రలో కనిపించి ఉన్నంత సేపు తన కామెడీతో మెప్పించాడు.

దీంతో మళ్ళీ కామెడీ పాత్రలు సప్తగిరికి క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube