ప్రముఖ తెలుగు సినీ నటుడు, కమెడియన్ జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన మృతితో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఆయన ఇంకా కూడా కొన్ని సినిమాలను చేస్తూనే ఉన్నాడు.ఆయన నటిస్తున్న సినిమాలు మద్యలో ఉన్నాయి.
పలు సినిమాలు ఆయన నటనతో సూపర్ హిట్ అయ్యాయి అనడంలో సందేహం లేదు.పూర్తి ఆరోగ్యంగా ఉన్న జేపీ అనూహ్యంగా మృతి చెందడంతో తెలుగు సినిమా ప్రముఖులు అంతా కూడా శోఖంలో మునిగి పోయారు.
స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు దాదాపు అందరితో కూడా జేపీ సినిమాలు చేయడం జరిగింది.విలన్‌గా ఎన్నో సినిమాల్లో చేసినప్పటికి ఆయన చేసిన కామెడీ పాత్రలు ఎప్పటికి నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు.
జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న నటుడు అవ్వడంతో జేపీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

మామూలుగా అయితే టాలీవుడ్ కు చెందిన వారు మృతి చెందితే ప్రదాని నుండి స్పందన ఉండదు.కాని జేపీకి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ట్వీట్ చేయడం జరిగింది.జేపీ ఒక మంచి నటుడు మరియు ఒక మంచి మనిషి అంటూ పేరు దక్కించుకున్నాడు.
అందుకే ఆయన మృతికి ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.అయితే ప్రధాని సంతాపం తెలుగులో ఉండటం మరింతగా గొప్ప విషయం అనుకోవచ్చు.ప్రధాని నుండి జేపీకి సంతాపం రావడం ఆయన సాధించిన గొప్ప విషయాల్లో ఒక్కటిగా చెప్పుకోవచ్చు.ట్విట్టర్ లో ప్రధాని జేపీ మృతి పట్ల స్పందిస్తూ….
జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు .తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు.వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు.వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.