తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండగా పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలను కమిట్ అవుతున్నాడు.
ఆయన ఇప్పటికే అట్లీ డైరెక్షన్ ( Atlee Direction ) లో ఒక సినిమా చేసే అవకాశం అయితే ఉంది.ఇక ఈ సినిమా రీమేక్ గా వస్తుందా లేదంటే ఒరిజినల్ కథతో తెరకెక్కుతుందా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓ జి సినిమాకి( OG movie ) వస్తున్న రెస్పాన్స్ ను చూసి బాలీవుడ్ జనాలు మొత్తం ఆశ్చర్యపోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసి ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక దానివల్లే పవన్ కళ్యాణ్ కి హిందీలో కూడా భారీ మార్కెట్ ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి.ఇక దానికి తోడుగా సుజీత్( Sujeeth ) ఇంతకుముందు చేసిన సాహో సినిమా కూడా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.
కాబట్టి ఈ సినిమా మీద కూడా అక్కడి జనాలు విపరీతమైన అంచనాలైతే పెట్టుకున్నారు.

ఇక సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.ఇక పవన్ కళ్యాణ్ మ్యానియా ను వాడుకొని సుజీత్ ఒక వండర్ ని క్రియేట్ చేయబోతున్నాడు.అంటూ సినిమా యూనిట్ మొత్తం ఇప్పటికే అఫీషియల్ గా చెప్తుంటే మరి కొంత మంది మాత్రం ఈ సినిమా కొంచెం తేడా కొట్టిన కూడా ఇది మరో డిజాస్టర్ అవ్వక తప్పదు అంటు సుజీత్ ను హెచ్చరిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమం లోనే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయగా తప్పదు.







