మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఇక ఈయన ఒకప్పుడు చేసిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే చిరంజీవి చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పాలి.
విజయ బాపినీడు డైరెక్షన్ లోనే వచ్చిన మరో సినిమా అయిన బిగ్ బాస్ సినిమా( Big Boss Movie ) భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మారింది.
అయితే ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ని ( Sister Sentiment ) ప్రధానంగా చేసుకొని ఈ సినిమాని చేశారు.అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆశించిన రీతిలో ప్రేక్షకుల అంచనాలను అందులోలేకపోయింది.ఇక ఈ సినిమా నుంచి సిస్టర్ సెంటిమెంట్ కథలకు బీజం పడిందనే చెప్పాలి.
ఇక ఆ ఆ తర్వాత చిరంజీవి హిట్లర్ సినిమాలో( Hitler Movie ) కూడా సిస్టర్ సెంటిమెంట్ తో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక దాదాపు చిరంజీవి అన్ని సినిమాల్లో కూడా ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ పీక్స్ లెవెల్లో ఉంటాయి.
వాటితోనే ఆయన మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుడు ఫీలయ్యే విధంగా నటిస్తూ సినిమాని రంజింపచేస్తాడు అందువల్లే ఆయన మెగాస్టార్ గా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు.ఇక బిగ్ బాస్ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక అందువల్లే ఈ సినిమాని చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు…ఇక ఈ సినిమా తో చిరంజీవి సూపర్ సక్సెస్ అందుకుంటాడని అందరూ భావించినప్పటికీ ఇది అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు…
.