చంద్రబాబుని అభినందించిన రజనీకాంత్..!!

ఏపీ ఎన్నికలలో కూటమి గెలవడం తెలిసిందే.దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 Rajinikanth Congratulated Chandrababu , Rajinikanth, Chandrababu, Superstar Raji-TeluguStop.com

అమరావతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సూపర్ స్టార్ రజినీకాంత్ ( Superstar Rajinikanth )అభినందనలు తెలియజేశారు.“ఎన్నికలలో అపూర్వ విజయం అందుకున్న నా మిత్రులు… చంద్రబాబు, సీఎం స్టాలిన్ కు అభినందనలు.అలాగే మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు.

ఎన్నికలలో గెలిచిన చంద్రబాబుకి చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్.ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ ఎన్నికలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో పక్క వ్యూహాలను అమలు చేయడం జరిగింది.రెండు గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు రోజుకి రెండు మూడు సభలలో పాల్గొన్నారు.

ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.ప్రసంగాలు చేశారు.

అభ్యర్థుల విషయంలో కూడా చాలా హోం వర్క్ చేసి.నిలబెట్టడం జరిగింది.

ఈ రకంగా పక్క ప్లానింగ్ తో దిగిన టీడీపీ కూటమి జరిగిన ఎన్నికలలో కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube