మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) అరెస్టు నేపథ్యంలో నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy ) ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిలను పోలీసులు హౌసెస్ చేశారు.
ఏపీ సిఐడి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనాలని ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేదన్నారు.మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో ఏపీ సిఐడి ఉందా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం పోకడలపై గాంధీయ పద్ధతిలో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.