రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా జక్కుల మహేందర్ ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షుడిగా రేసు రాజయ్య, ఉపాధ్యక్షులుగా రాందాస్, నారాపురం నరసయ్య, ప్రధాన కార్యదర్శి గా ఎస్ శ్రీనివాస్, కోశాధికారిగా శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బంది సమావేశమై సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ఆద్వర్యంలో ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు నిర్వహించారు.







