ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.
ఈ శనివారంతో ప్రచారం ముగియనుంది.సో ఇటువంటి పరిస్థితులలో ఏపీ ఎన్నికల ప్రచారాలలో సినిమా తారల సందడి ఎక్కువయ్యింది.
ప్రధానంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని గెలిపించడానికి చాలామంది తెలుగు నటీనటులు ఏపీకి తరలిరావడం జరిగింది.జబర్దస్త్ షో కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శీను మరియు టీవీ సీరియల్ నటీనటులు పిఠాపురంలో పర్యటించడం జరిగింది.
మెగా హీరోలు సైతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా వీడియో చేయడం జరిగింది.
పిఠాపురం ఎమ్మెల్యేగా తన తమ్ముడిని గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఇదిలా ఉంటే బుధవారం దివంగత కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్( ప్రభాస్) పెద్దమ్మ శ్యామలాదేవి కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు.నరసాపురంలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఏపీ ఎన్నికలు 2019 కంటే 2024 చాలా సీరియస్ గా జరుగుతున్నాయి.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.బీజేపీ, టీడీపీ, జనసేన( BJP, TDP, Jana Sena ) పార్టీలో కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.
వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి.వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ప్రస్తుతం భారీ ఎత్తున ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇదే సమయంలో సినీ సెలబ్రిటీలు కూడా పలు పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు.ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి( Shyamala Devi ) నరసాపురం ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున పాల్గొనడం సంచలనంగా మారింది.