తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో పాల్గొన్నారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.“జీవితంలో కొందరు ఊహకు అందరూ.గత ఎన్నికల్లో జగన్( YS Jagan ) ను తక్కువ అంచనా వేశాం.
సరిగ్గా అంచనా వేయలేకపోవడం మా వైఫల్యమే.జగన్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఊహించలేదు.
ఇంత ప్రమాదకారి కాబట్టే.జగన్ ని వైయస్సార్( YSR ) బెంగళూరుకు కామని పరిమితం చెప్పేవారు.
అని పేర్కొన్నారు.నా జీవితంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలుగు కమ్యూనిటీని తీసుకెళ్లాలి.
తెలుగు రాష్ట్రాలలో పేదరికం లేకుండా చేయాలి అనేది తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నారు. జైల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.కుర్చీ, మంచం.అనేక వాటి గురించి పోరాడాల్సి వచ్చింది.నన్ను మానసిక క్షోభకు గురిచేసి లేకుండా చేయాలని అనుకున్నట్లు అర్థమయింది.కానీ నేను గట్టిగానే పోరాడా అని పేర్కొన్నారు.
తినే ఆహారం విషయంలో ఇంకా పలు విషయాలలో.న్యాయస్థానాల ద్వారా నా భద్రత చూసుకున్నానని తెలిపారు.
కానీ నేను జైల్లో ఉన్న సమయంలో నాకోసం ఈ దేశంలోనే కాదు నాకు తెలియని దేశాలలో వాళ్లు కూడా మద్దతు తెలపటం చాలా ఎమోషనల్ కలిగించింది.ఇటువంటి పరిస్థితులు ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు.
అదేవిధంగా నన్ను నమ్ముకున్న ప్రజలకు మరింత మంచి చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.