కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy )హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి జారీ చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయలేమని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి బెయిల్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.