దేశవ్యాప్తంగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ తాజాగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనను మెచ్చుకుంటున్నారు.మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటన మెచ్చుకోవాల్సిందే.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జీవించేశాడు.
ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తాడు.
ఆ సన్నివేశంలో తన లో ఉన్నా అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టే విధంగా ఆ సీన్ కనిపిస్తూ ఉంటుంది.అయితే ఆ సన్నివేశం కోసం రామ్ చరణ్ ఎన్నో కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.
సినిమా లోని ఆ సన్నివేశం కోసం రామ్ చరణ్ చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోను చరణ్ కు బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఈ వీడియోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సినిమాలోని ఆ ఒక్క చిన్న సింగ్మెంట్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో ట్రైనర్ వీడియోలో చెప్పుకొచ్చాడు.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో బాక్సింగ్ సిగ్మెంట్ చాలా చిన్నదే అయినప్పటికీ నా బ్రదర్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు.చిన్న సీన్ కోసం చాలా కష్టపడ్డాడు.అంతటి పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఆయన రక్తాన్ని ధారపోసి చెమట చిందించాడు అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా సినిమా బాహుబలి సినిమా కలెక్షన్స్ ను క్రాస్ చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అంతేకాకుండా ప్రస్తుతం థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.







