బుల్లితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమర్ ( Amar )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అమర్ దీప్ జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఈయనకు బిగ్ బాస్ ( Bigg Boss )అవకాశం వచ్చింది.బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన పట్ల ఇతర కంటెస్టెంట్లు చాలా చులకనగా వ్యవహరించారు బిగ్ బాస్ కూడా కొన్ని లాజికల్ ప్రశ్నలు వేయగా అమర్ సమాధానం చెప్పలేకపోవడంతో తన అమాయకత్వం మొత్తం బయటపడింది.
![Telugu Amardeep, Bb Ustav, Prashanth, Sreemukhi, Sreemukhiamar-Movie Telugu Amardeep, Bb Ustav, Prashanth, Sreemukhi, Sreemukhiamar-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Sreemukhi-insulted-amar-in-bb-ustav-eventb.jpg)
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో అమర్ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది.ఇలా వీరిద్దరూ గొడవ పడటంతో బయటకు వచ్చినా కూడా ఈ గొడవ సర్దుమనగలేదని చెప్పాలి.ప్రశాంత్ అభిమానులు అమర్ కారు పై దాడి చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఏకంగా ప్రశాంత్ ను జైలుకు తీసుకువెళ్లిన సంగతి కూడా తెలిసిందే.ఇలా వీరిద్దరి మధ్య తారస్థాయిలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు.
![Telugu Amardeep, Bb Ustav, Prashanth, Sreemukhi, Sreemukhiamar-Movie Telugu Amardeep, Bb Ustav, Prashanth, Sreemukhi, Sreemukhiamar-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Sreemukhi-insulted-amar-in-bb-ustav-eventc.jpg)
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్న వీరు మాత్రం కలవలేదు.కానీ స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ ఉత్సవ్ ( BB Ustav ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లు అందరూ కూడా వేదికపై సందడి చేశారు అయితే ఈ వేదికపై మరోసారి అమర్ ను అందరూ కలిసి బకరానీ చేసేసారు.
యాంకర్ శ్రీముఖి అమర్ ను ప్రశ్నిస్తూ ఒక చీర ఆరడానికి 30 నిమిషాలు పడితే 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది అని ప్రశ్నించగా అమర్ మౌనంగా ఉండడంతో ఉద్దేశపూర్వకంగానే అమర్ ను అవమానించడం కోసమే ఇలా చేస్తున్నారు అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.