ప్యాకెట్ పాలలో ప్రమాదకరమైన కెమికల్.. తనిఖీల్లో తెలిసిన నిజాల గురించి తెలిస్తే..

సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది ప్రజలు ప్యాకెట్ పాలను తాగుతూ ఉన్నారు.ఇదే అదునుగా భావించి చాలామంది కల్తీ రాయుళ్లు తాగే నీరు, పాలు అని చూడకుండా కల్తీ చేయడం ఆందోళన కలిగిస్తుంది.

 Dangerous Chemical In Packet Milk , Dangerous Chemical , Packet Milk , Milk , Ya-TeluguStop.com

తాజాగా ప్రజలకు అమ్ముతున్న పాలు కల్తీ అన్న వార్త తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఏకంగా శవాలకు వాడే కెమికల్స్ ను పాలలో కలుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీలలో ఈ విషయం బయటపడింది.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది.

యాదాద్రి బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రవేట్ పాలసేకరణ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.పాలన పరీక్షించగా దానిలో శవాలను భద్రపరచడానికి ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ కెమికల్ ను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది.

పాలు ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి ఫార్మాల్డిహైడ్ కెమికల్ ఉపయోగిస్తున్నట్లు పాలసేకరణ సెంటర్ నిర్వాహకుడు కాడెం కుమార్ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

Telugu Chemical, Safety Officers, Problems, Tips, Milk, Packet Milk-Telugu Healt

ఈ కేంద్రానికి ఈరోజు 600 లీటర్లకు పైగా పాలసరఫరా జరుగుతుందని పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్, అమోనియం, సల్ఫేట్ ను కలిపి ఎక్కువ పాలు కల్తీ తయారు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.ఈ పాల ప్యాక్ చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు హైదరాబాద్లోని చాలా హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్లు కూడా సమాచారం.ఈమెరకు కుమార్ ని అరెస్ట్ చేసి లోతైన దర్యాప్తును చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Telugu Chemical, Safety Officers, Problems, Tips, Milk, Packet Milk-Telugu Healt

ఎలాంటి అనుమతులు లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరి పైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.దీనితో పాటు పీడీ ఆక్టికేసులు కూడా నమోదు చేస్తున్నామని వెల్లడించారు.హైదరాబాద్ కు తరలిస్తున్న వాహనాలను ఆపి పాల షాంపిల్స్ సేకరించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇలా పాలలో ఫార్మాల్డిహైడ్ కెమికల్ కలపడం వల్ల ప్రజలలో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

శ్వాస, జీర్ణకోశా, కాలయా సంబంధమైన వ్యాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube