తెలుగు తెరపై మరో మళయాళ భామ ఎంట్రీ..!

మళయాళ భామలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది.ముంబై భామలు అందంతో అదరగొడుతుంటే మళయాళ భామలు తమ అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచేస్తున్నారు.

 Samyukta Menon Grand Entry With Bheemla Nayak, Samyukta Menon , Bheemla Nayak ,-TeluguStop.com

ఇప్పటికే చాలామంది మళయాళ భామలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా లేటెస్ట్ గా మరో మళయాళ భామ పవన్, రానా కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇస్తుంది.సాగర్ చంద్ర డైరక్షన్ లో పవన్, రానా కలిసి చేస్తున్న సినిమా భీమ్లా నాయక్.

ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా రానాకి జతగా మళయాళ భామ సంయుక్త మీనన్ ను సెలెక్ట్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంయుక్త టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.మళయాళ, కన్నడ, తమిళ భాషల్లో 13 కి పైగా సినిమాలు చేసిన సంయుక్త తెలుగులో భీంలా నాయక్ తో ఎంట్రీ ఇస్తుంది.

తప్పకుండా సంయుక్తకి ఈ సినిమా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని చెప్పొచ్చు.భీమ్లా నాయక్ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసినా ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube