2025 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి ఉంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మూడు సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే
సంక్రాంతి సీజన్ దాదాపుగా పూర్తి కావడంతో సమ్మర్ సీజన్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు.ఈ ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న చాలా సినిమాలు వాయిదా పడ్డాయనే సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఏప్రిల్ నెద్ల 10వ తేదీన ది రాజాసాబ్( The Rajasaab ) సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.అయితే షూటింగ్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది.

మరోవైపు పవన్ హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) మార్చి నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ చెబుతున్నా ఆ తేదీకి ఈ సినిమా విడుదలవుతుందో లేదో గ్యారంటీగా చెప్పలేము.విశ్వంభర( Vishwambhara ) సినిమా మే నెల 9వ తేదీన రిలీజవుతుందని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.మాస్ జాతర, కన్నప్ప, హిట్3, జాక్, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు మాత్రమే సంక్రాంతి పండుగ ఆప్షన్స్ కానున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ విషయంలో పెద్ద సినిమాలకు సంబంధించి ఒకింత గందరగోళం నెలకొంది.టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలపై ఇతర భాషల్లో సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పాన్ ఇండియా సినిమాలు అంచనాలకు మించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలు( Summer Movies ) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారో లేదో చూడాల్సి ఉంది.