అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేస్తోంది.ఈ క్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విద్యను అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులకు మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
దీనిలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఐచ్ఛిక ప్రాక్టీకల్ ట్రైనింగ్ కోసం నిబంధనలు అమలు చేయనుంది.అంతర్జాతీయ విద్యార్ధులు తమ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఒక సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లోని విద్యార్ధులైతే దీనిని మరో రెండేళ్లు పొడిగించుకోవచ్చు.దీని వల్ల విదేశీ విద్యార్ధులకు ఉన్నత విద్య, ఆ తర్వాత అక్కడే ఉద్యోగాన్ని పొందడంతో పాటు హెచ్1బీ వీసాను అందుకోవచ్చు.
అయితే ఈ ఓపీటీ విధానం స్ధానికుల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుండటంతో ఈ పద్ధతిని రద్దు చేయాలని అక్కడి రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తోంది.ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం ఓపీటిని పొందే ప్రక్రియలో కఠిన నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది.
దీనిలో భాగంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సైతం ఎఫ్ మరియు ఎమ్ వీసాలపై విద్యార్ధులకు ఉన్న ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆప్షన్స్‌ను సవరించనుంది.దీని ప్రకారం ఓపీటీ సమయాన్ని కుదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కొత్త నిబంధనలను రూపొందించి, ప్రజాభిప్రాయ సేకరణకు గాను కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.ప్రజల అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత తుది ముసాయిదాను బడ్జెట్ కార్యాలయానికి పంపుతారు.2020 చివర్లో లేదా 2021 ప్రారంభంలో ఓపీటీ కొత్త మార్గదర్శకాలను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నారు.కాగా కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓపెన్ డోర్స్ సర్వే ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 2.02 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారు.వీరిలో 34.2 శాతం (69,000) మంది ఇంజనీరింగ్, 37 శాతం(74,745) మంది మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్‌లలో ఉన్నారు.