తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అంటే..?

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( sri venkateswara swamy ) కొలువుదిరా తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమలకు భారీగా క్యూ కడుతున్నారు.

 Devotees Huge Rush In Tirumala Tirupati ,tirupati , Devotees, Devotional, Ttd ,-TeluguStop.com

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టీటీడీ అధికారులు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉన్నారు.సోమవారం శ్రీవారి భక్తులతో ( Devotees )తిరుమల ఎంతో రద్దీగా ఉంది.

మే 29వ తేదీ సోమవారం అర్ధరాత్రి వరకు 78 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.దాదాపు 37,600 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Telugu Andhra Pradesh, Devotees, Devotional, Srivenkateswara, Tirupati-Latest Ne

సోమవారం శ్రీవారికి మూడు కోట్ల 74 లక్షల హుండీ కానుకల రూపంలో వచ్చాయని టీటీడీ అధికారులు( TTD ) తెలిపారు.తిరుమలలో భక్తుల రద్ది ఎక్కువ కావడంతో క్యూ కాంప్లెక్స్ నిండిపోయి క్యూ లైన్లు తిరుమల లోని టీబీసీ కాటేజ్ వరకు వచ్చాయి.ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు వారికి కేటాయించిన సమయంలోనే స్వామివారి దర్శనం కలుగుతుంది.సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Devotees, Devotional, Srivenkateswara, Tirupati-Latest Ne

అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఓపికగా ఉండాలని ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం అవుతుందని అంతవరకు సహనంతో ఉండాలని టిటిడి అధికారులు మనవి చేశారు.ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.వేసవి సెలవులు పూర్తికావస్తున్న సమయంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు వేల సంఖ్యల్లో తిరుమల చేరుకుంటున్నారు.వేసవి సెలవులు పూర్తీ అయ్యేవరకు తిరుమలలో భక్తుల రద్దు ఎక్కువగా ఉంటుందని టిటిడి అధికారులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే జూన్ నెలలో తిరుమల లో విశేషా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ ఉత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube