ములుగు జిల్లాలో పలు అబివ్రుద్ది కార్యక్రమాలు చేపట్ట నూతన భవనాలను ప్రారంబించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత. జిల్లాలోని గోవిందరావుపేట ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, యం పి మాలోతు కవిత, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లకు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కల పెంపకం గురించి గ్రామస్తులతో మాట్లడారు.ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలో మరియు పర్యాటక ప్రాంతమైన లక్నవరం వెళ్లే మార్గ మధ్యలో పర్యాటకులు సేద తీర్చుకోవడానికి రెండు కిచెన్ షెడ్ కు శంకుస్థాపన చేశారు.
జంగాలపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహ నూతన భవనాన్ని ప్రారంభించి, దళిత బంధు కార్యక్రమంలో పాల్గొని మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో 119 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు ద్వారా ట్రాక్టర్లు మరియు ఎర్టకా వాహనాలను అందజేశారు.వెనుకబడిన ఏజెన్సీ ములుగు జిల్లా ప్రాంతంలో 119 మంది లబ్ధిదారులకు గాను 59 ట్రాక్టర్లు, 32 కార్లు, 06 బొలెరో వాహనాలు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి అన్నారు.
దళితులు సమాజంలో ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు ద్వారా చేసే ఎంపిక ప్రణాళికా బద్ధంగా లేదని దిశానిర్దేశంతో కూడిన పధకాన్ని అమలు చేయాలని అన్నారు.దళిత బంధు పథకం స్వాగతించ దగ్గ పథకంగా సీతక్క కొనియాడారు.
దళిత బంధు పొందిన లబ్ధిదారులు వాటిని దుర్వినియోగ పరచకుండా సద్వినియోగ పరచుకొని దినదినాభివృద్ధి చెందాలని కోరారు.