మన మేలు కోరేవాడు.మనల్ని తిట్టినా మంచిదే అని అంటారు పెద్దలు.
అదే సమయంలో తనమేలు కోసం మనల్ని ప్రశంసించేవారితో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తారు.ఈ విషయంలో రాజకీయ నేతలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు పరిశీలిస్తే.అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇటు అధికార పక్ష నేత జగన్ కూడా ఒకే పంథాలో ముందుకు సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గతంలో చంద్రబాబు.వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన నాయకులను అవసరం లేకున్నా.
చేర్చుకున్నారు.ఇంకేముంది.
పార్టీ మరింత బలోపేతం అయిపోతుంది.
సో.
మళ్లీ మనమే వచ్చేస్తాం మనమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం.అని అనుకున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ గోడలు దూకి సైకిల్ ఎక్కిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు.వారు కోరినంత డబ్బులు ఇచ్చారు.
వారు కోరిన పదవులు కూడా కట్టబెట్టారు.పార్టీలో సీనియర్లను కూడా పక్కన పెట్టారు.
మొత్తానికి చంద్రబాబును వారు వాడుకున్నారు.గత ఏడాది ఎన్నికల్లోనూ టికెట్ లు పొందారు.
చివరకు ఓడిపోయారు.ఇక ఇప్పుడు అలాంటి వారిని బాబు వాడుకుందామనుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
ఎవరి అడ్రస్‌లు ఎక్కడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఇక, జగన్ విషయానికి వస్తే.ఈయన కూడా గత చంద్రబాబు మాదిరిగానే టీడీపీలోని నేతలను ఎమ్మెల్యేలను వలేసి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు.వారు కోరుతున్న విధంగా నిధులు ఇస్తున్నారు.
వారి వారి వ్యాపారాలకు అడ్డు చెప్పడం లేదు.అంతేకాదు, వారివారి వ్యాపారాలకు ఉన్న అడ్డుపుల్లలను కూడా తొలిగిస్తున్నారు.
మరికొందరికి పదవులు ఇచ్చారు.ఇంకొందరికి హామీలు ఇచ్చారు.
అంటే.ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది ఏంటి? జగన్ తన కష్టంతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలోకి గోడదూకి వచ్చిన టీడీపీ నాయకులు లేదా ఇతర పార్టీల నాయకులు (జనసేన ఎమ్మెల్యే) జగన్‌ను బాగానే వాడేస్తున్నారు.
జగన్ వల్ల వీరంతా ఆశించిన మేరకు లబ్ధి పొందుతున్నారు.కొన్నిఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కన పెట్టారు.మరి ఇలా వచ్చి.పదవులు, హామీలు, అనుమతులు పొందుతున్న వారు రేపు జగన్‌కు ఏదైనా కష్టం వస్తే.నిలబడతారా? అసలు వీరికి ఆ పరిస్థితి ఉందా? లేక.బాబు మాదిరిగానే పరిస్థితి రిపీట్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఏం జరుగుతుందో చూడాలి.