`బాహుబలి` తరువాత దక్షిణాదిలో పాన్ ఇండియా స్థాయి చిత్రాల పరంపర మొదలైంది.తాజాగా ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ పాన్ ఇండియా స్థాయికి మించి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
`మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే ను చిత్ర బృందం ఎంపిక చేసింది.
భారీ హంగులతో అత్యంత భారీగా తెరపైకి రానున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్‌కి పెను భారంగా మారుతోందట.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నామంటూ ప్రకటించిన సి.
అశ్వనీదత్ ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.ప్రాజెక్ట్ అయితే ప్రకటించారు.
హీరో, హీరోయిన్‌లకి అడ్వాన్స్‌లు ఇచ్చేశారు.కానీ సినిమా పట్టాలెక్కించడానికి వీరి వద్ద కావాల్సి మొత్తం అందుబాటులో లేదట.
ఫైనాన్షియర్‌లని నమ్మి ముందడుగు వేసినా కరోనా కారణంగా వారిలో ఎలాంటి కదలిక లేదని తెలుస్తోంది.పోనీ వారిని పక్కన పెట్టి దిల్‌రాజు, అల్లు అరవింద్‌లని కలుపుకుని వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేదని, వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.
`సాహో` ఫలితం కారణంఆనే ఫైనాన్షియర్‌లు ముందుకు రావడం లేదట.అంతే కాకుండా యంగ్ డైరక్టర్ ఇంత భారీ చిత్రాన్ని డీల్ చేయగలడా అన్న సందేహం కూడా వుండటంతో ఫైనాన్షియర్‌లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.ఇక ప్రభాస్ నటిస్తోన్న `రాధేశ్యామ్` ఫలితాన్ని గమనించిన తరువాతే ఈ ప్రాజెక్ట్‌కి ఫండింగ్ చేస్తామని ఫైనాన్షియర్‌లు అశ్వనీదత్‌కు భరోసా ఇచ్చారట.దాంతో తన వద్ద వున్న అమౌంట్‌తో ముందు షూటింగ్ ప్రారంభించాలని దత్తు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.