విదేశాంగ మంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ..!!

విదేశాంగ మంత్రి జయశంకర్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ లెటర్ రాయడం జరిగింది.బహ్రెయిన్ లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

 Ys Jagan Urges Union Minister Of External Affairs To Repatriate Ap Workers From-TeluguStop.com

కరోనా కారణంగా అక్కడ పనులు ఆగిపోవటంతో పని చేసే సంస్థల యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.ఈ విషయంలో భారత ప్రభుత్వం కలుగ చేసుకోవాలని.

వెంటనే వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు అని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కి తెలియజేశారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.విదేశీ వ్యవహారాల శాఖకు ఎలాంటి వివరణ కావాల్సి ఉన్న ఏపీ రెసిడెంట్ కమిషనర్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సంప్రదించాలని లేఖలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే బహ్రెయిన్ లో.చాలావరకు చిక్కుకున్నవారు చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు.ఇప్పటికే శ్రీకాకుళం వాసులు ఈ విషయంలో సోషల్ మీడియాలో.వీడియోలు పెడుతూ.తమ బాధలు చెప్పటంతో పాటు నరకయాతన పడుతున్నట్లు పేర్కొన్నారు.దీంతో సీఎం జగన్ తాజాగా ఈ విషయంపై విదేశాంగ మంత్రికి లెటర్ రాయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube