జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై వైసీపీ నాయకులు విరుచుకుపడిన ప్రతిసారి వారికి ధీటైన రీతిలోనే కౌంటర్లు ఇస్తుంటాడు.అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ప్రజల్లో ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.
అధికార పార్టీపై అతను చేసినంత ఘాటు విమర్శలు, దూకుడు ఇప్పటివరకు ఏపీలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ రాజకీయ పార్టీ ధైర్యం చేసింది లేదు.ఇలా తనను మాటలతో టార్గెట్ చేసిన రాజకీయ ప్రత్యర్థుల నోట్లు మూయించేలా పవన్ మాట్లాడడం మామూలే అయితే అతని ప్రశ్నలకు సమాధానంగా వైఎస్ జగన్ నుండి ఎటువంటి స్పందన ఉండదు.
కేవలం ఒక్క అసెంబ్లీ సీట్లు వచ్చిన పార్టీ వారితో నేనేంటి కొమ్ములాటకు వెళ్ళేది అని సీఎం అనుకొని ఉండవచ్చు.
అయితే అదే హుందాతనం జగన్ అతని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తాజాగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పై చేసిన ఘాటైన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.“అంబా… అంబా అనే లోపు రాంబోలా మాట్లాడుతారు.ఆయనేమో నీటిపారుదల శాఖా మంత్రి కానీ ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు.ఏపీ గురించి మాట్లాడితే మిమ్మల్ని రానివ్వం… కేసులు పెడతామంటారు.ఇలాంటి పిచ్చి కథలు ఆపేస్తే మంచిది.మీ ఉత్తర కుమార ప్రగల్భాలకు మేము భయపడే ప్రసక్తే తెలియదు” అని చెప్పారు.

అంతటితో ఆగకుండా అంబటి అవినీతి పనులపై నేరుగా ప్రస్తావించి పంచులతో నిలువునా పరువు తీసేసారు పవన్.వారానికి ఒకసారి నేను ఏపీకి వస్తాను అని అంటారు.నేను వారానికి ఒకసారి వస్తేనే ఇలా ఉంది… ఇక రోజు వస్తే ఇంకేం అవుతుంది అని అంటూనే పేద రైతులకు అందించాల్సిన ₹7 లక్షల్లో… 2 లక్షలు లంచం తీసుకున్నాడు అంటూ అంబటి రాంబాబుని విపరీతంగా విరుచుకుపడ్డాడు.

అయితే ఎన్నో రోజుల నుండి పవన్ ఇలాగా వైసిపి వారిని విమర్శిస్తున్నా… వాళ్ళు రివర్స్ లో పవన్ కళ్యాణ్ ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటాడు… అతను టిడిపి దత్త పుత్రుడు, ప్యాకేజీ తీసుకున్నాడు వంటి డైలాగులే తిప్పి తిప్పి కొడుతున్నారు తప్ప పవన్ లాగా నేరుగా పాయింట్ మాట్లాడి విమర్శలు చేయడం లేదు.మరి జగన్ కు విషయం అర్థమవుతుందో లేదో కానీ వీరి మాటలు వినీ వినీ సొంత పార్టీ అభిమానులే విసిగిపోయారు.ఇక ఎలక్షనలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ చివరికి రంగంలోకి దిగాల్సిందేనా.?
.






