తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.బీఆర్ఎస్ పై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.టీఆర్ఎస్ గులాబీ కూలీ పేరుతో నిధుల సేకరణపై రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు ఎన్నికల కమిషన్ లేఖ పంపింది.కానీ విచారణ పూర్తి కాకముందే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.







