వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్ షూట్ కోసం టైం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ అంటే?

నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరో వైపు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

 Balakrishna Veera Simha Reddy Shoot Update Details, Veera Simha Reddy, Nandamuri-TeluguStop.com

అఖండ సినిమా విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.అందుకే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా 2023లో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయిన ఈ సినిమాలో ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.మరొక పక్క సాంగ్ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ షూట్ గురించి అప్డేట్ ఒకటి తెలుస్తుంది.ఈ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేయబోతున్నారు అని.శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఈ సాంగ్ బాలయ్య-శృతి హాసన్ కాంబోలో తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.అలాగే ఈ సాంగ్ డిసెంబర్ 21న షూట్ చేయబోతున్నారు అని టాక్.

చూడాలి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.చూడాలి బాలయ్య అఖండ సక్సెస్ ను కొనసాగిస్తాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube