తెలుగు సినిమా ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటుంది.ఈమద్య కాలంలో అన్ని సినిమా లకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు ఆడియో విడుదల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించే వారు.కాని ఇప్పుడు అలా జరగడం లేదు.ఆడియో విడుదల వేడుకలకు ముందే పాటలను విడుదల చేస్తున్నారు.ఒక్కో పాట ఒక్కో పాట చొప్పున విడుదల చేయడం వల్ల ఆడియో విడుదలకు స్కోప్ ఉండటం లేదు.అందుకే ప్రీ రిలీజ్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.కొందరు అయితే ట్రైలర్ విడుదల వేడుకను భారీగా చేస్తున్నారు.
ఏదో ఒక విధంగా జనాల్లో ఉండాలనే ప్రయత్నాలు బాగానే సఫలం అవుతున్నాయి.అయితే ఇప్పుడు సినీ వేదికల గురించి చర్చ జరుగుతోంది.
ఇంతకు ముందు సినిమా వేడుక అంటే హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక పేరు గుర్తుకు వచ్చేది.పదేళ్ల కాలంలో వేలాది సినిమాలకు సంబంధించిన వేడుకలను అందులో నిర్వహించడం జరిగింది.
ఆ తర్వాత హైటెక్స్ ఆ తర్వాత కన్పెన్షన్ ల్లో ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తున్నారు.ఈ మద్య కాలంలో విజయవాడ మరియు వైజాగ్ ల్లో సినిమా వేడుకలను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆంద్రా మరియు తెలంగాణలో మాత్రమే సినిమా వేడుకలను నిర్వహిస్తే రాయలసీమ వారు ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశ్యంతో కర్నూలు లో కూడా ఈ మద్య వరుసగా సినిమా వేడుకలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారు.అక్కడ జనాలు పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు.
ఇదే సమయంలో అక్కడ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది.అందుకే అక్కడ ప్రీ రిలీజ్ వేడుకలు లేదా సక్సెస్ వేడుకలను నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు.
ఇటీవల సర్కారు వారి పాట యొక్క వేడుక అక్కడ జరిగింది.రానా మరియు సాయి పల్లవిల యొక్క విరాట పర్వం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక అక్కడ జరిగింది.
ఆ సమయంలో భారీ గాలి వాన వచ్చినా కూడా అభిమానులు అక్కడ నుండి వెళ్లి పోలేదు.త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు కర్నూలు వేదికగా జరగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.







